పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
దేవీపట్నం: మండలంలోని పోశమ్మగండి వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరదలు లేనప్పటికీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు జరుగుతుండటంతో ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు మూసివేసి కొద్దిపాటి నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో బ్యాక్ వాటర్ కారణంగా పోశమ్మగండి వద్ద నీటిమట్టం మూడురోజులుగా సుమారు పది అడుగుల మేర పెరిగింది. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం ఇటీవల వరద నీటినుంచి బయటపడినప్పటికీ ప్రస్తుత ముంపు కారణంగా ఆలయం నీటమునిగింది. పూడిపల్లి, చినరమణయ్యపేట పంచాయతీలకు సంబంధించిన ప్రాజెక్టు ముంపు భూముల్లో రైతులు సాగుచేసిన మొక్కజొన్న పైరు దాదాపు 100 ఎకరాల్లో పంట నీటమునిగింది. దండంగి నుంచి పోశఽమ్మగండికి వెళ్లే రహదారి పైకి గోదావరి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
దండంగి మార్గంలో నిలిచిన రాకపోకలు


