ప్రతిరోజు ఇలాంటిభోజనమేనా?
మీటింగ్‌కు వచ్చిన తల్లిదండ్రులకు సరైన భోజన పెట్టలేదు. కూర రుచికరంగా లేదు. పిల్లలకు మంచి రుచికరమైన భోజనం పెడితేనే కదా వారు తిని ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బాగా చదువుకుంటారు. మాకు ఎదురైన అనుభవాన్ని బట్టి ప్రతీ రోజు ఇలాంటి భోజనమే పెడతారని భావించాల్సి వస్తోంది.
– నూతన, రంపచోడవరం
కనీస ఏర్పాట్లు లేవు
రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మోగా పేరేంట్స్ మీటింగ్ కోసం కనీస ఏర్పాట్లు చేయలేదు. తరగతి గదిలో మీటింగ్ పెడితే ఎంత మంది తల్లిదండ్రులు కూర్చోవడానికి వీలుంటుంది. పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నారు. దీనిని బట్టి పాఠశాల వారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పాఠశాల ఆవరణలో కనీసం టెంట్ కూడా వేయించలేదు. విద్యా కమిటీ చైర్మన్‌గా ఏర్పాట్లు బాగోలేవని మీటింగ్‌కు హాజరు కాలేదు. భోజన ఏర్పాట్లు అధ్వానంగా ఉన్నాయి. ఉడికీ ఉడకని అన్నం పెట్టారు. అందువల్లే అక్కడ భోజనం చేయలేదు.
– సుందర్‌సింగ్, విద్యా కమిటీ చైర్మన్, రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల
ప్రతిరోజు ఇలాంటిభోజనమేనా?


