
దసరా ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో ఈఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వేర్వేరు చోట్ల ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పురాతన ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కొలువుదీరిన శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో ఈ ఏడాది తొలిసారిగా దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించి. ఇటీవల నూతన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాల ప్రచార పోస్టర్లను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షురాలు,పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గురువారం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు,రమాదేవి దంపతులు,ఆలయ అర్చకులు రామంపంతులు,ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం,ఉత్సవ కమిటీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కొట్టగుళ్లి రామారావు,యాదగిరి శ్రీనివాసరావు, కొమ్మెజి వెంకటరమణ, ఉపాధ్యక్షులు శివ,ప్రభాకర్,శ్రీనివాసరావు, బొడ్డు ముకుందరావు, కొండలరావు, రాజబాబు, బాలన్న, కోశాధికారి దేశిది బాబురావు, పోతురాజు, నాగు,మూర్తి తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో పందిరిరాట
పాడేరు మెయిన్‌రోడ్డులో రూ.10 లక్షల అంచనా వ్యయంతో దసరా ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం పందిరాట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎరువాక వెంకటరమణ, వైస్ ఎంపీపీ గంగపూజారి శివ, కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు శివరాత్రి నాగేశ్వరరావు, బూరెడ్డి నాగేశ్వరరావు, వెయ్యాకుల సత్యనారాయణ, పచ్చా బుజ్జి,బిక్కవోలు రవి, ఉపాధ్యక్షులు బిమ్మలపూజారి ఈశ్వరరావు,కూడి వలసంనాయుడు, కొమ్మెజి వెంకటరమణ,ప్రధాన కార్యదర్శులు యాదగిరి శ్రీను, బోనంగి వెంకటరమణ,అనుబోతుల గణేష్,కార్యదర్శులు కూడి రామునాయుడు,జ్యోతికిరణ్,శివరాత్రి సూర్యప్రకాష్ పాల్గొన్నారు.

దసరా ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ