
ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపం
కోటవురట్ల: ఓ యువతి ఇష్టం లేని పెళ్లి చేశారని తీవ్ర మనస్తాపం చెందింది. మనసు చంపుకొని భర్తతో కాపురం చేయలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని ఆక్సాహేబుపేటలో గురువారం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన చల్లపల్లి లోవలక్ష్మి (24)కి ఇష్టం లేకపోయినా నాలుగు నెలల క్రితం ఆక్సాహేబుపేటకు చెందిన జోగిరాజుకు ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి కలతగా ఉన్న ఆమె మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో శబ్దం రావడంతో బంధువులు వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడు తూ కొన ఊపిరితో కనిపించింది. ఆమెను ఉరి నుంచి తప్పించి హుటాహుటిన తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. అయితే లోవలక్ష్మి భర్త జోగిరాజు చాలా మంచి వ్యక్తి అని, అర్థం చేసుకోకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపం