
సమస్యల షాక్ !
ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఆధునికీరణ పదేళ్లుగా ప్రతిపాదనలకు పరిమితం అయ్యాయి. పురాతన యంత్రాలు కావడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మరమ్మతులకు రూ.కోట్లు వెచ్చించి సరిచేయాల్సి వస్తోంది. ఇలా భారీగా నష్టం జరుగుతున్నా ఇరు రాష్ట్రాల అధికారుల్లో కదలిక లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యంత్రాల మొరాయింపుతో నిలుస్తున్న విద్యుత్ ఉత్పాదన
వినియోగంలో లేని జనరేటర్లు
మాచ్‌ఖండ్‌కు
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలు విద్యుత్ ఉత్పాదనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఎప్పుడు ఉత్పత్తి నిలిచిపోతుందో తెలియని దుస్థితి నెలకొంది. గతంలో జలాశయాల్లో నీటి సమస్యతో ఉత్పాదన నిత్యం నిత్యం ఆటంకం కలుగుతూ ఉండేది. ఈ ఏడాది ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్‌కు కీలకమైన జోలాపుట్టు, డుడుమ జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళలాడుతున్నాయి. ఏడాదికి సరిపడే నీరు జలాశయాల్లో ఉండడంతో నీటి సమస్య తీరినట్లు అయింది.
● మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం అతి పురాతనమైనది కావడంతో విద్యుత్ ఉత్పాదనకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ కేంద్రంలో ఆరు జనరేటర్ల సాయంతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 2023లో ఆగస్టు,సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో మాత్రమే పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు తరచూ నెలకొంటున్న సాంకేతిక సమస్యల వల్ల పూర్తిస్థాయిలో జరిగిన సందర్భాలు లేవు.
మరమ్మతులకు ఏటా రూ.కోటు్ల
120 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఉన్న జలవిద్యుత్ కేంద్రంలో జనరేటర్లకు కాలం చెల్లడంతో తరుచూ మొరాయిస్తున్నాయి. వీటి మరమ్మతుల కు ఏటా రూ.కోట్లు ఖర్చువుతున్నాయి. ప్రతి జలవిద్యుత్ కేంద్రంలో జనరేటర్లు 25 ఏళ్లు వరకు పని చేస్తాయి. కాని ఇక్కడ జనరేటర్లు 60 ఏళ్లు సేవలందించడం వల్ల మరమ్మతులకు గురవుతున్నాయి.
ఐదు నెలల్లో
నాలుగు సార్లు
ఆధునికీకరణ ఒప్పందాలకు పరిమితం
ఉత్పాదన పెంపునకు కృషి
డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో ప్రస్తుతం ఏడాదికి అవసరమైన నీటి నిల్వలు ఉండడం విద్యుత్ ఉత్పాదన పెంపునకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం 97 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అన్ని జనరేటర్ల వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి మరికొన్ని రోజుల్లో జరిగే అవకాశం ఉంది. సాంకేతిక లోపాలను వెంటనే సరి చేస్తున్నాం.రూ.500 కోట్లతో ఆధునికీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.
– ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు,
ఎస్‌ఈ, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఆధునికీకరణకు ఇరు రాష్ట్రాలు పదేళ్ల క్రితం రూ. 500 కోట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఉన్న 120 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 150 మెగా వాట్లకు పెంచాలని నిర్ణయించాయి. చేపట్టాల్సిన పనులకు సంబంధించి నివేదిక బాధ్యతను 2022లో టాటా ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి ఏపీ జెన్‌కో అధికారవర్గాలు అప్పగించాయి. సుమారు 14 మందితో కూడిన బృందం మూడు దఫాలు మాచ్‌ఖండ్ ప్రాజెక్టు, డుడుమ, జోలాపుట్టు జలాశయాలను పరిశీలించింది. జనరేటర్లు, టర్బైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్ యార్డులు, భవనాల స్థితిగతులు, వాటికి ఆయువు (ఎనాలసిస్) పరీక్షలు నిర్వహించింది. దీనిపై పూర్తి స్థాయి నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు 2024లోనే బృందం అందజేసింది. అప్పటినుంచి ఏమాత్రం కదలికలేదు.

సమస్యల షాక్ !

సమస్యల షాక్ !