
మాచ్‌ఖండ్‌లో విద్యుత్‌ఉత్పాదన పునరుద్ధరణ
● 2,4 జనరేటర్లకు మరమ్మతులు
● వినియోగంలోకి తెచ్చిన అధికారులు
ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో రెండు రోజులుగా నిలిచిపోయిన ఉత్పాదన గురువారం సాయంత్రం నుంచి మొదలైంది. సాంకేతిక లోపం వల్ల 11 కేవీ బుష్ కాలిపోవడంతో ఉత్ప త్తి నిలిచిపోయింది. మరమ్మతులు చేపట్టి 4వ నంబరు జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకువచ్చి 23 మెగావాట్ల ఉత్పత్తిని పునరుద్ధరించారు. అనంతరం రాత్రి ఏడు గంటల సమయంలో రెండో నంబరు జనరేటర్‌ను వినియోగంలో తెచ్చి 17 మెగావాట్లు ఉత్పత్తి పునురుద్ధరించారు. మాచ్‌ఖండ్ ప్రాజెక్టులో ప్రస్తుతం 40 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, మిగిలిన జనరేటర్లను వినియోగంలోకి తెచ్చేందుకు సిబ్బంది, అధికారులు ప్రాజెక్ట్ ఎస్‌ఈ ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రమిస్తున్నారు. గత రెండు రోజులుగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఏపీ జెన్‌కోకు భారీగా నష్టం కలిగింది.గంటకు 97 మెగావాట్లు చొప్పన 48గంటల ఉత్పత్తికి అవకాశం లేకుండా పోయింది.