
జోలాపుట్టు, డుడుమ కళకళ
● ఇరు రాష్ట్రాల సరిహద్దులో భారీ వర్షాలు
● పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టాలు
ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ,జోలాపుట్టు జలాశయాల్లో నీటిమట్టాలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా గురువారం నాటికి 2,580.60 అడుగులుగా నమోదు అయింది.జోలాపుట్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు కాగా గురువారం నాటికి 2748.10 అడుగులు ఉన్నట్టు సిబ్బంది తెలిపారు.జలాశయాల్లో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండడంతో ఈ ఏడాది విద్యుత్ ఉత్పిత్తికి నీటి సమస్య లేదని ప్రాజెక్టు అధికార వర్గాలు తెలిపాయి.