
వాగు దాటితేనే రేషన్ దక్కేది!
● అవస్థలు పడిన దొరగూడ గిరిజనులు
ముంచంగిపుట్టు: రేషన్ సరకులు తెచ్చుకునేందుకు మంలంలోని లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గిరిజనులు గురువారం అష్టకష్టాలు పడ్డారు. ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న ఉబ్బెంగుల వాగును దాటుకుని ఆరు కిలోమీటర్ల కాలినడకన పంచాయతీ కేంద్రం లక్షీపురంలోని జీసీసీ డిపోకు చేరుకున్నారు. రేషన్ సరకులు తీసుకుని మళ్లీ అలాగే అవస్థలు పడుతూ దొరగూడ వెళ్లారు. ఉబ్బెంగుల వాగుపై వంతెన నిర్మించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ నేత సాధురాం, దొరగూడ గిరిజనులు ఈ సందర్భంగా కోరారు.