
స్పోర్ట్స్ మీట్‌లో పి.యర్రగొండ ఏకలవ్య విద్యార్థుల ప్రత
వై.రామవరం: గుంటూరులో నిర్వహించిన ఏకలవ్య పాఠశాలల రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో పి.యర్రగొండ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 3 నుంచి 9 వరకు జరిగిన పోటీల్లో బాక్సింగ్, యోగా, వెయిట్ లిఫ్టింగ్, చెస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో 10 బంగారు, 8 సిల్వర్, 3 బ్రాంజ్ పతకాలు సాధించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ భూరా రామ్ భైరవ తెలిపారు. త్వరలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు 39 మంది ఎంపికయ్యారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా వారిని గురువారం ఆయనతోపాటు పీఈటీ ప్రశాంత కృష్ణన్, ఉపాధ్యాయులు అభినందించారు.
చింతపల్లి: జాతీయ క్రీడా పోటీలకు ఐదుగురు విద్యార్థినులు ఎంపికై నట్టు స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్‌కుమార్ తెలిపారు. గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. అండర్ 19 హ్యాండ్ బాల్లో ఎస్.యోగబాల, వాలీబాల్‌లో పి.మేరీ, కె.లక్ష్మీప్రసన్న, కబడ్డీలో వి.నవ్య, డిస్కస్‌త్రోలో పి. స్వీటీ పతకాలు సాధించారన్నారు. వీరు వచ్చే నెలలో ఒడిశాలో జరిగే జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న విద్యార్థినులకు తర్ఫీదు ఇచ్చిన పీఈటీలు తులసి, రాజేశ్వరిని ఆయనతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.

స్పోర్ట్స్ మీట్‌లో పి.యర్రగొండ ఏకలవ్య విద్యార్థుల ప్రత