
అనంతగిరిలో అత్యధిక వర్షపాతం
● 65.8 ఎంఎం నమోదు
● అత్యల్పంగా డుంబ్రిగుడలో 1.2 ఎంఎం
సాక్షి,పాడేరు: మన్యంలో రోజూ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన గెడ్డలు,వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జి.మాడుగుల మండలంలోని కుంబిడిసింగి రోడ్డులో మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో గిరిజనులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గురువారం అనంతగిరిలో అనంతగిరిలో అత్యధికంగా 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జి.మాడుగులలో 35.6, దేవీపట్నంలో 24.8, ముంచంగిపుట్టులో 24.6, అరకులోయలో 14.6, గంగవరంలో 14.5, కొయ్యూరులో 14, వై.రామవరంలో 9.4, పాడేరులో 6.8, అడ్డతీగలలో 3.2, రాజవొమ్మంగిలో 10.2, వీఆర్‌పురంలో 4.6, కూనవరంలో 4.2, చింతూరులో 3.6, పెదబయలులో 3, ఎటపాకలో 1.6, రంపచోడవరంలో 1.2, డుంబ్రిగుడలో 1.2 వర్షపాతం నమోదైంది. మరోపక్క పాడేరు పరిసర ప్రాంతాల్లో ఉదయం 8గంటల వరకు మంచు దట్టంగా కురుస్తోంది.