
చెక్‌పోస్టు లేక..
మోతుగూడెం వద్ద ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో చెక్‌పోస్టును తొలగించడం వల్ల జలవిద్యుత్ కేంద్రాల మెటీరియల్‌కు రక్షణ కరువైంది. ఇక్కడ పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నిర్మించిన సమయంలో ఏర్పాటైన దీనిని 2019లో జెన్‌కో అధికారులు తీసేశారు. మోతుగూడెం, పొల్లూరు ఉద్యోగుల నివాస సముదాయాల్లో పైపులు, డిస్ట్రిబ్యూషన్, పవర్ హౌస్‌కు సంబంధించిన యంత్ర పరికరాలు వివిధ స్టోర్స్‌లో భద్రపరుస్తారు. నిత్యం విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లే బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు ఈ మార్గంలో తిరుగుతాయి. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన యంత్ర పరికరాలు చోరీకి గురి కాకుండా మోతుగూడెం చెక్‌పోస్టు వద్ద ఏపీ జెన్ సెక్యూరిటీ విభాగం సిబ్బంది వాహనాలను నిలిపి తనిఖీ చేసేవారు. ఈ నేపథ్యంలో 2019లో ఈ చెక్‌పోస్టును తీసేయడం వల్ల జలవిద్యుత్‌కేంద్రాల మెటీరియల్‌కు రక్షణ లేకుండా పోయింది. సుమారు ఏడు నెలల క్రితం అప్పర్ సీలేరు హెచ్‌టీ స్టోర్స్‌లో విలువైన రాగి వైర్లు మాయమైనట్టు ప్రచారం జరిగింది. మోతుగూడెంలో జెన్‌కో సిబ్బంది నివాసాల ప్రాంగణంలో డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి పనికిరాని ఐరన్ మెటీరియల్‌న తీసుకుపోతున్న కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి.