
రోగులకు అందుబాటులోవైద్య సిబ్బంది
● డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు ఆదేశం
అరకులోయ టౌన్: పీహెచ్‌సీల్లో అత్యవసర వైద్యం అందించేందుకు 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. బుధవారం అరకులోయ, అనంతగిరి మండలాల్లోని అనంతగిరి, సుంకరమెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పీహెచ్‌సీల్లో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. సుఖ ప్రసవాల వివరాలను వైద్యాధికారుల నుంచి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో నమోదైన మలేరియా కేసులు, వారికి అందిస్తు న్న వైద్యం గురించి ఆరా తీశారు. ఎపిడమిక్ సీజన్‌లో వైద్య సిబ్బంది గ్రామ స్ధాయిలో సందర్శించి సకాలంలో రోగులకు వైద్య సేవలందించాలని సూచించారు. ఆస్పత్రిలో ఉన్న మందుల నిల్వలు, వార్డులను తనిఖీ చేశారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె. కమల కుమారి, జిల్లా కార్యాలయ విస్తరణాధికారులు ఎం. సంజీవ్ పాత్రుడు, సిబ్బంది పాల్గొన్నారు.