7వ పేజీ తరువాయి
పారిశుధ్యలోపమే కారణమని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన లాగరాయి, లబ్బర్తి, కిండ్రలో నిర్వహించిన వైద్యశిబిరాలను ఆయన సందర్శించారు. అనంతరం లాగరాయి పీహెచ్‌సీని పరిశీలించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో రెండు చికెన్ గున్యా కేసులు నమోదు అయినట్టు వైద్యాధికారులు శిరీష్, డేవిడ్ కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం మరో 12 మంది జ్వరపీడితులకు రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. రోగ నిర్ధారణ అనంతరం ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ ఎక్కడ చూసినా పారిశుధ్యం అధ్వానంగా ఉందన్నారు. పరిస్థితి మెరుగుపడాలని గ్రామసచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. దోమల నివారణ చర్యలు ముమ్మరం చేయాలని మలేరియా సిబ్బందికి సూచించారు. జ్వరపీడితులు పడుతున్న ఇబ్బందులను ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, లాగరాయి సర్పంచ్ మిరియాల గణలక్ష్మి, ఎంపీటీసీ పెద్దిరాజు కలెక్టర్‌కు వివరించారు. సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్, డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు, ఏడీఎంహెచ్‌వో డేవిడ్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో యాదగిరీశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ డీ గౌతమి పాల్గొన్నారు.
గంగవరం: గిరిజన రైతులు ఎరువుల కోసం అధైర్య పడొద్దని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కొత్తాడ రైతు సేవా కేంద్రంలో ఎరువుల నిల్వలను పరిశీలించిన ఆయన మాట్లాడారు. గిరిజన రైతులందరికీ ఎరువులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. రైతు సేవా కేంద్రాలు, సొసైటీల ద్వారా యూరియా పంపినీ చేస్తామన్నారు. రూ.2 వేల విలువైన యూరియా బస్తాను గిరిజన రైతులకు రూ.267కు అందిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 193 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటివరకు రైతులకు సరఫరా చేశామన్నారు. అనంతరం నెల్లిపూడిలో ఆయన పర్యటించారు. సుమారు 3500 ఎకరాల భూమి ముకాస భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్, తహసీల్దార్ సిహెచ్ శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి కింటుకూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
రోగులకు సత్వర వైద్యం అందించాలి