
పోలవరం నిర్వాసితులకు 4 వేల ఎకరాలు
7వ పేజీ తరువాయి
ఆదేశించారు. పీఎంఆర్‌సీ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణంపై సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజక్టు ముంపునకు గురైన చింతూరు డివిజన్‌లోని నిర్వాసితులకోసం రాజవొమ్మంగి, అడ్డతీగల, గంగవరం మండలాల్లో సుమారు 4వేల ఎకరాల భూమి గుర్తించాలన్నారు. ప్రభుత్వ భూమి, గిరిజనేతరుల భూమి,గిరిజనులకు సంబంధించిన భూములను గుర్తించాలని సూచించారు. పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియ తహసీల్దార్లు పూర్తి చేయాలని సూచించారు. అడ్డతీగల, గంగవరం మండలాల్లో గుర్తించిన భూమి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన, గిరిజనేతరుల నుంచి సేకరించే భూమి ఎటువంటి ఎల్‌టీఆర్‌పీ కేసులుగాని, భూ తగదాలు లేని భూములను గుర్తించాలన్నారు. కాలనీలకు దగ్గరల్లో భూమికి భూమి ఇచ్చేందుకు అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. కాలనీల ఏర్పాటుకు నిర్వాసితులకు ఆస్పత్రులు, పాఠశాలలు, సంతలు, మార్కెట్లు, బస్సు సౌకర్యం ఎంత దూరంలో ఉన్నాయో ముందుగా నిర్వాసితులకు తెలియజేయలన్నారు. భూమిని గుర్తించిన తరువాత నిర్వాసితులు చూపించడం జరుగుతుందన్నారు. నిర్వాసితుల కోసం నిర్మించే కాలనీల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు శ్రీనివాసరావు, ఎన్ దొర, బాలాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.