
ట్రాక్టర్ నడుపుతుండగా ఫిట్స్
యువకుడు మృతి
కొయ్యూరు: ట్రాక్టర్ నడుపుతుండగా ఫిట్స్ రావడంతో ప్రమాదానికి లోనై యువకు డు మృతి చెందాడు. కొ య్యూరు ఎస్‌ఐ కిషోర్‌వర్మ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. రేవళ్లు పంచాయతీ నిమ్మలపాలేనికి చెందిన చుండ్రు సింహాచలం (21) ఆదివారం సురేంద్రపాలెంలో ఉంటున్న తన చిన్నా న్న చుండ్రు కృష్ణారావు ఇంటికి వెళ్లి పొలం దు న్నేందుకు ట్రాక్టర్ కావాలని తీసుకెళ్లాడు. ట్రాక్టర్ తీసుకువస్తున్న సమయంలో కొయ్యూరు శివారులో సింహాచలానికి ఫిట్స్ వచ్చాయి. దీంతో అ తను నడుపుతున్న ట్రాక్టర్ తాటిచెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో సింహాచలం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.