
పెండింగ్ నిర్మాణ పనులపై నివేదికలు
అధికారులకు కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
సాక్షి, పాడేరు: పెండింగ్‌లో ఉన్న మార్కెటింగ్ శాఖ ఎంపీఎఫ్‌సీ గిడ్డంగుల నిర్మాణ పనులపై నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు, పలు శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 42 ఎంపీఎఫ్‌సీ గిడ్డంగులు మంజూరయ్యాయని, నేటికీ పూర్తికాని 16 భవనాల నిర్మాణ పురోగతి, త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన సదుపాయాలపై వెంటనే నివేదిక అందజేయాలన్నారు. ఈ సమావేశంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వభరత్, డీసీవో ఎం.వి.రామకృష్ణరాజు, మార్కెటింగ్ శాఖ డీఈ, ఏఈఈలు పాల్గొన్నారు.