
గంజాయి స్వాధీనం– ఇద్దరు అరెస్టు
చింతపలి: ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న రూ.6 లక్షలు విలువైన గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు. ఎస్‌ఐ అందించిన వివరాలిలా ఉన్నాయి. సీఐ వినోద్‌బాబు అందించిన ముందస్తు సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున కోరుకొండ– అన్నవరం జంక్షన్ సమీపంలో లోతుగెడ్డ వంతెన వద్ద వాహనాలు తనిఖీ చే సినట్లు తెలిపారు. ఈ క్రమంలో రోళ్లగెడ్డ గ్రామం నుంచి మైదాన ప్రాంతానికి సంచులతో తరలిస్తున్న 105 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.6 లక్షలు ఉంటుందన్నారు. గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టె చేసి రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
రైల్వేస్టేషన్‌లో గంజాయి స్వాధీనం
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న 23 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌లోని సోమవారం తనిఖీల్లో హుగ్లీ కు చెందిన కుమార్‌రామ్, బిహార్‌కు చెందిన దిలీప్‌సింగ్ అదుపులోకి తీసుకుని, 23 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.