
కలెక్టర్‌తో ఐటీడీఏ పీవోలు భేటీ
సాక్షి,పాడేరు: కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్‌ను పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ కొత్త పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్‌లు సోమవారం కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు, పూలమొక్కలను అందజేసి తమ ఆత్మీయతను చాటుకున్నారు. కలెక్టర్‌తో వారు కొద్దిసేపు భేటీ అయ్యారు. పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పీవోలను ఆదేశించి, అభినందనలు తెలిపారు.
కలెక్టర్ దినేష్‌కుమార్‌కు పుష్పగుచ్ఛం
అందజేస్తున్న పాడేరు, రంపచోడవరం
ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్

కలెక్టర్‌తో ఐటీడీఏ పీవోలు భేటీ