తాటిచెట్లపాలెం: ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, ఈస్ట్‌కోస్ట్‌రైల్వేలోని వాల్తేర్ డివిజన్‌లో ‘సండేస్ ఆన్ సైకిల్స్’ అనే కొత్త కార్యక్రమాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్‌బోహ్రా ప్రారంభించారు. ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సందర్భంగా డీఆర్‌ఎం, రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు డీఆర్‌ఎం నివాసం నుంచి డివిజన్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముందు,
ఈస్ట్‌కోస్ట్‌రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు జ్యోత్స్నా బోహ్రా ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని డీఆర్‌ఎం తెలిపారు. యోగా, జుంబా, స్కిప్పింగ్ రోప్ వంటి కార్యక్రమాలను కూడా ఇందులో భాగం చేశారు. స్పోర్ట్స్ ఆఫీసర్ యం. హరనాథ్ , జనరల్ సెక్రటరీ ఎన్. ఉష ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.