
గ్రామాల్లో జ్వరాలతో సతమతం
● మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న
గిరిజనం
● పెరుగుతున్న బాధితుల సంఖ్య
● పట్టించుకోని అధికారులు
రాజవొమ్మంగి: మండలంలోని లాగరాయి పీహెచ్‌సీ పరిధిలోని లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో పలువురు జ్వరాలు. మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నారు. నెల రోజులుగా ఈ సమస్యతో పీహెచ్‌సీకు వచ్చే వారి సంఖ్య పెరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరహాలో ఎప్పుడూ తాము అనారోగ్యం పాలు కాలేదని పలువురు రోగులు చెబుతున్నారు. పీహెచ్‌సీలో ట్యాబ్లెట్స్ మాత్రమే ఇస్తున్నారని, ఇందుకు సంబంధించి వైద్యులు రక్త పరీక్షలకు కూడా సిఫార్సు చేయడం లేదని చెబుతున్నారు. అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి సరైన వైద్యం అందజేయాలని కోరుతున్నారు.
ఆదివారం పీహెచ్‌సీకు 25 మంది జ్వరపీడితులు జ్వరాల సమస్య లాగరాయి, కిండ్ర గ్రామాల్లో అధికంగా ఉంది. ఇంటికీ ఒకరు ఇద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. ఆదివారం లాగరాయి పీహెచ్‌సీకు 25 మంది జ్వరాలతో చికిత్స కోసం రావడం గమనార్హం. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
రాజవొమ్మంగి మండలం లాగరాయి పీహెచ్‌సీ పరిధిలో జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఈ సమస్యను ఇటీవల మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు దృష్టికి తీసుకొని వెళ్లాం. ఆయన సంభందిత అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి, తక్షణ వైద్య సేవలందించాలి.
– గోము వెంకటలక్ష్మి, ఎంపీపీ, రాజవొమ్మంగి

గ్రామాల్లో జ్వరాలతో సతమతం

గ్రామాల్లో జ్వరాలతో సతమతం