
34 కిలోల గంజాయి స్వాధీనం
● ముగ్గురి అరెస్ట్
జి.మాడుగుల: గంజాయిని రెండు బైకులపై తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపారు. చింతపల్లి వెళ్లే మార్గంలో జి.మాడుగుల మండలం పెదలంక రోడ్డు జంక్షన్ వద్ద శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో బైక్‌లపై వచ్చిన వ్యక్తులను పరిశీలించగా 34 కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్‌ఐ తెలిపారు. ఇద్దరు పరారీ కాగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వివరించారు వీరి నుంచి రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించామని ఆయన పేర్కొన్నారు.
చింతూరులో 25 కిలోలు..
చింతూరు: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా 25 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన సేఖ్ రాంబాబు అనే వ్యక్తిని శనివారం చింతూరు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐ రమేష్ తమ సిబ్బందితో స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తారసపడిన అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద సంచిని తనిఖీచేయగా 25 కిలోల గంజాయి లభ్యమైనట్లు ఎస్‌ఐ తెలిపారు. దీని విలువ రూ 1.25 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.

34 కిలోల గంజాయి స్వాధీనం