
ఏయూ ఆచార్యులకు అవార్డులు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని పలువురు ఆచార్యులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరున బెస్ట్ అకాడమీషన్ ఆఫ్ ది ’ఇయర్ 2025 అవార్డులను అందించారు. సెనేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏయూ ఆచార్య జి.పి.రాజశేఖర్ అవార్డులను అందజేశారు. లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సీతామాణిక్యం, సైన్స్ కళాశాల కెమిస్ట్రీ విభాగం ఆచార్యురాలు డీవీవీ శైలజ, ఇంజినీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు వెంకట్రావులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎ.నరసింహారావు, ఆచార్య ఎం. వి. ఆర్. రాజు, ఆచార్య జి. శంకర్, ఆచార్య కె. సీతామాణిక్యం, ఆచార్య ఆర్. పద్మశ్రీ, ఆచార్య డి. నాగరాజకుమారీ ,పపలువురు డీన్లు, డైరెక్టర్లు, అధికారులు, ఆచార్యులు పాల్గొన్నారు.