
క్రీడా పోటీల్లో ఏకలవ్య విద్యార్థినుల ప్రతిభ
రాజవొమ్మంగి: స్థానిక ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న సాయిహర్షిణి, దుర్గాపావని గుంటూరులో జరిగిన బాలికల విభాగం క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచారు. వీరిద్దరు జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ కృష్ణారావు తెలిపారు. సాయిహర్షిణి బ్యాడ్మింటన్ సింగిల్స్, సాయిహర్షిణి, దుర్గాపావని డబుల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారు. ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 28 ఏకలవ్య పాఠశాలలు పాల్గొన్నాయని పీఈటీ మెఘారావత్ తెలిపారు. ఇలావుండగా గుంటూరులో ఈనెల 7, 8, 9 తేదీల్లో జరిగే బాలుర రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆదే పాఠశాలకు చెందిన 30 మంది బాలురు హాజరవుతున్నారని ప్రిన్సిపాల్ కృష్ణారావు, పీఈటీ సత్యనారాయణ తెలిపారు.