
ఉపాధ్యాయులదే గురుతర బాధ్యత
పాడేరు : విద్యార్థులను ఉత్తమమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు పట్టణంలోని కాఫీ హౌస్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ న్ చిత్రపటానికి కలెక్టర్ దినేష్‌కుమార్, డీఆర్వో పద్మలత, డీఈవో బ్రహ్మాజీరావు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమ శిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. సమాజాభివృద్ధికి గురువే మూలమన్నారు. గురువు అనే వ్యక్తి అందరి కన్నా ఆదర్శంగా ఉండాలన్నారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 60 మంది ఉపాధ్యాయులను కలెక్టర్, డీఆర్వో పద్మలత, డీఈవో తదితరులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యాలయ సహాయ సంచాలకుడు బాలకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులదే గురుతర బాధ్యత

ఉపాధ్యాయులదే గురుతర బాధ్యత

ఉపాధ్యాయులదే గురుతర బాధ్యత