
వంజంగి వ్యూపాయింట్ అభివృద్ధికి నిధులు
● పాడేరు డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి
● రూ.35 లక్షలు కేటాయింపు
సాక్షి,పాడేరు: వంజంగి వ్యూపాయింట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి డాక్టర్ పి.వి.చలపతిరావు రూ.35 లక్షలు మంజూరు చేశారని పాడేరు డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. పర్యాటక ప్రాంతం వంజంగి నిర్వహణను వేర్వేరు శాఖలు నిర్వహించేవని,అయితే అటవీశాఖ పరిధిలోకి వంజంగి నిర్వహణ బాధ్యత అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ ఆయ్యాయన్నారు. కమ్యూనిటీ ఆధారితి పర్యావరణ పర్యాటకం,వనసంక్షరణ సమితిలను భాగస్వామ్యం చేస్తూ వంజంగిని పర్యాటకంగా అటవీశాఖ అభివృద్ధి చేస్తుందన్నారు. పర్యాటక సీజన్ ప్రారంభం కానున్నందున ప్రస్తుతం విడుదలైన నిధులతో పర్యాటకులకు తక్షణ మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తాగునీటి సదుపాయాల కల్పన, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తనిఖీ కేంద్రం, సైన్‌బోర్డులు, సిమెంట్ బెంచ్‌లు, ప్లాస్టిక్ బిన్లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.