
ముంచంగిపుట్టులో భారీ వర్షం
ముంచంగిపుట్టు: మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఉదయం అంతా ఎండ కాసి, మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు, కుమడ, జోలాపుట్టు, డుడుమ రహదారులు చిత్తడిగా మారాయి. కొన్ని చోట్ల మట్టి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో వాహన చోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన వారపు సంత సైతం బోసిపోయింది. రంగబయలు,లక్ష్మీపురం,బుంగాపుట్టు,భూసిపుట్టు పంచాయితీల్లో వాగులు, గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహించాయి. మత్స్యగెడ్డలోకి సైతం వరదనీరు భారీగా చేరింది.
డుంబ్రిగుడ: మండలంలోని శనివారం భారీ వర్షం కురిసింది. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత వారం రోజుల నుంచి మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు వర్షం కురుస్తుండటంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.