
ఉపాధి పనుల కల్పనలో కూటమి ప్రభుత్వం విఫలం
మోతుగూడెం: వై రామవరం మండలం డొంకరాయి గ్రామంలో శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఇన్‌చార్జి లోకనా థం పర్యటించి గిరిజనులతో మాట్లాడారు. గ్రామస్తులు డేవిడ్, మగాళ్డాన్, లైకన్,ముక్తా తదితరులు పలు సమస్యలు విన్నవించారు. గ్రామంలో జాబ్ కార్డులు ఉన్నప్పటికీ పని చూపించడం లేదన్నారు. ఉన్నత విద్య చదినప్పటికి ఉపాధి చూపించడంలో జెన్‌కో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. గిరిజన సొసైటీలు ఉన్నప్పటికి జెన్‌కోలో చిన్న చిన్న పపనులను కూడా టెండర్ విధానంలో ఇస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న పట్టాలు మంజూరు చేయడం లేదన్నారు.ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో కనీసం జాబ్ కార్‌ుడ్స ఉన్నప్పటికి ఉపాధి చూపించలేకపోతుందన్నారు. జెన్‌కో గిరిజన సొసైటీలకు పనులు అప్పగించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు వీటిపై దృష్టి సారించాలన్నారు. లేని పక్షంలో గిరిజనులతో కలిసి పోరాడతామన్నారు.నాయకులు కిరణ్, రాంబాబు, రమణ, న్యాయవాది లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.