
మన్యంలో ప్రకృతి సాగు బాగు
పాడేరు : జిల్లాలో గిరిజన రైతులు చేపడుతున్న ప్రకృతి వ్యవసాయం ఎంతో బాగుందని తమకు బాగా నచ్చిందని మేఘాలయ రాష్ట్రానికి చెందిన మహిళా రైతు ప్రతినిధుల బృందం ప్రతినిధులు కితాబిచ్చారు. పదిరోజుల జిల్లా పర్యటన, శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని బిరిమిశాల, గుర్రం పనుకు గ్రామాల్లో స్థానిక గిరిజనులు సాగు చేస్తున్న ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న వివిధ పంటలను పరిశీలించారు. వరితో పాటు మోడల్ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. క్షేత్ర సందర్శన ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నేల సంరక్షణ, తక్కువ ఖర్చుతో వ్యవసాయ సాగు నైపుణ్యాలు, స్వయం సాధికారిత అంశాలపై అవగాహన పొందారు. స్థానిక గిరిజన రైతులతో కలిసి శ్రీవరి విధానంలో నాట్లు వేశారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ రీజనల్ టీం, సైన్స్ ఆండ్ రీసెర్చ్ టీం, ప్రకృతి రైతులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
మేఘాలయ మహిళా రైతు
ప్రతినిధుల బృందం కితాబు

మన్యంలో ప్రకృతి సాగు బాగు