
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు
చింతూరు: కూనవరం మండలం కోతులగుట్టలో గిరిజన పోరాటయోధుడు కొమరం భీం విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ డివిజన్ ఛైర్మన్ జల్లి నరేష్ డిమాండ్ చేశారు. విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చింతూరులో భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల విగ్రహాలపై దాడులుచేసి ఆదివాసీలను భయపెట్టలేరని, ఇలాంటి ఘటనలకు పాల్పడటం ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఆదివాసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం, పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జేఏసీ నాయకులు మెయిన్‌రోడ్ సెంటర్‌లోని కొమరం భీం విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ శీలం తమ్మయ్య, మండల కార్యదర్శి కాక సీతారామయ్య, బొడ్డు బలరాం, కణితి గణేష్, సోడె నారాయణ, తోడెం దేశయ్య, మడివి రాజు, కారం చందు, రాఘవయ్య, చంద్రయ్య, లక్ష్మణ్, అర్జున్, సురేష్ పాల్గొన్నారు.
ఆదివాసీ జేఏసీ డివిజన్ ఛైర్మన్‌జల్లి నరేష్ డిమాండ్