
వైఎస్సార్‌సీపీ మరింత పటిష్టతకు కృషి
● అరకు వైఎస్సార్‌సీపీ నేతలకు శాసనమండలి ప్రతిపక్ష నేతబొత్స సత్యనారాయణ సూచన
బీచ్‌రోడ్డు (విశాఖ): వైఎస్సార్‌సీపీ మరింత పటిష్టతకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సూచించారు. శనివారం సిరిపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ అరకు నియోజకవర్గ నాయకులు కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలతో పాటు పార్టీలోని పలు అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వైనాన్ని ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందన్నారు. కష్టపడి పనిచేసే వారికి తగిన ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బొత్సను కలసిన వారిలో అరకు నియోజకవర్గ మాజీ సమన్వయకర్త అరుణ కుమారి, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, అరకు వేలి ఎంపీటీసీ దురియ ఆనంద్ కుమారి, సీనియర్ నాయకులు ఎస్ సోమేష్, వంతల రాంబాబు ఉన్నారు.