
ఓఎన్జీసీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం
రాజవొమ్మంగి: స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓఎన్జీసీ నిర్మించిన ఆర్వోప్లాంట్‌ను ఆ సంస్థ ఈడీ సంతానుదాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో హెచ్‌ఎం ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఈ స్కూల్లో చదువుతున్న దాదాపు 500 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు. బోర్‌వెల్, షెడ్డు, ఆర్వోప్లాంట్ నిర్మాణానికి రూ. 10 లక్షల సీఎస్సార్ నిధులు వెచ్చించినట్లు సంస్థ జీఎం రూణా మజుందర్ వెల్లడించారు. పాఠశాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా తాగునీటి కుళాయిలు ఏర్పాటుచేశామన్నారు. సర్పంచ్ గొల్లపూడి రమణి, సంస్థ ప్రతినిధులు ఆర్‌ఎస్. రామారావు, కొమ్ము సత్యనారాయణ, సంజుక్త దాస్, విద్యాకమిటీ చైర్మన్‌న్ శ్రీనివాస్, ఎంఈవో సూరయ్యరెడ్డి, ఉపాధ్యాయులు బొజ్జయ్య, కొండబాబు, శివకృష్ణ, పాల్‌బాబు పాల్గొన్నారు.