
గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి
అడ్డతీగల: త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, ఈ నెలాఖరులోగా గృహ ప్రవేశాలు చేసేందుకు ల బ్ధిదారులు సిద్ధం కావాలని గృహనిర్మాణశాఖ రాష్ట్ర ప్రత్యేకాధికారి పి.వెంకటరమణ సూచించారు.అడ్డతీగల మండలం కొత్తపాలెం,గొండోలు గ్రామాల్లో పీఎంఎవై గ్రామీణ్, పీఎం జన్‌మన్ పథకాల కింద నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడు లేని ప్రతి నిరుపేదలకు సొంత గృహం ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అర్హులందరూ ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.రంపచోడవరం డివిజన్ ఈఈ ఎ.రవికుమార్,డీఈఈ శ్రీరామచంద్రమూర్తి, ఏఈ రాజశేఖర్,ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రత్యేకాధికారి వెంకటరమణ