
స్వర్ణాంధ్ర సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి
● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి, పాడేరు: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా జిల్లా విజన్ కార్యాచరణ ప్రణాళికపై సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలు, పర్యాటకం, మహిళా శిశుసంక్షేమం, పేదరిక నిర్మూలన తదితర ఆంశాలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షిస్తారని, అధికారులంతా సమగ్ర వివరాలతో సమావేశానికి రావాలన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఇద్దరు మంత్రుల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.