కార్మికులు, ప్రజాసంఘాల బంద్‌ ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

కార్మికులు, ప్రజాసంఘాల బంద్‌ ప్రశాంతం

Jul 10 2025 7:03 AM | Updated on Jul 10 2025 7:03 AM

కార్మ

కార్మికులు, ప్రజాసంఘాల బంద్‌ ప్రశాంతం

పాడేరు : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో విజయవంతమైంది. సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని వర్గాల కార్మికులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సుండ్రుపుట్టు సాయిబాబా గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్‌ బజార్‌, పాత బస్టాండ్‌, సినిమాహాల్‌ సెంటర్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా కార్మికలోకానికి నష్టం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఉన్నాయంటూ పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన తెలిపారు. ఐటీడీఏ ఔట్‌ గేటు వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్‌ మాట్లాడుతూ కార్మికులకు తీవ్ర నష్టం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎంజిల్లా ప్రధాన కార్యదర్శి పి. అప్పలనర్స, ఏఐటీయూ జిల్లా నేత సాయి శంకర్‌, మెడికల్‌ ఆండ్‌ హెల్త్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి లింగేరి సుందర్‌రావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ ఆండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్మిక సంఘ నేతలు అప్పారావు, అర్జున్‌, కో ఆపరేటివ్‌ బ్యాంకు కార్మిక సంఘం నాయకులు అప్పలనాయుడు, జాతీయ కాఫీ రైతుల సంఘం నేత పాలికి లక్కు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జీవన్‌, కార్తిక్‌, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఆపరేటర్ల యూనియన్‌ నాయకులు ధామోదర్‌, సింహాచలం, సెక్యూరిటీ యూనియన్‌ నాయకులు చంటిబాబు, పలు కార్మిక సంఘాల నేతలు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

అరకులోయ టౌన్‌: కార్మికులకు నష్టం కలిగించే విధంగా కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను కేంద్రం మెడలు వంచైనా వాటిని రద్దు చేయిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి. ఉమా మహేశ్వరరావు అన్నారు. బుధవారం దేశ వ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు మండలంలోని గిరిజన మ్యూజియం, పెట్రోల్‌ బంక్‌లు, పర్యాటక యూనిట్లు, సోఫ్‌ యూనిట్‌, పద్మావతి ఉద్యానవనం, కాఫీ హౌస్‌లు మూసి వేసి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. గిరిజన మ్యూజియం వద్ద జరిగిన సమావేశం అనంతరం ప్రధాన రహదారిలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ మండల కార్యదర్శి జన్ని భగత్‌రామ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌, మండల కార్యదర్శి రామారావు, అంగన్‌వాడీ, టూరిజం, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, సో్‌ప్‌ యూనిట్‌ కార్మిక సంఘ ప్రతినిధులు వెంకటలక్ష్మీ, నాగమ్మ, దాడి రాజు, రఘు, ధర్మ, అభిన, దామోదర్‌, సింహాద్రి, రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

విధులు బహిష్కరించిన బ్యాంకు ఉద్యోగులు

చింతపల్లి: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చింతపల్లి యూనియన్‌ బ్యాంకు ఉద్యోగులు బుధవారం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఏఐబీఈఏ యూనియన్‌ నాయుకులు ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో పాల్గొనడం జరిగిందని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు.న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కె. వెంకటేష్‌, ఉదయ్‌ శంకర్‌, సూర్యకుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్‌

అరకులో మూతబడిన రిసార్ట్‌లు

కార్మికులు, ప్రజాసంఘాల బంద్‌ ప్రశాంతం1
1/3

కార్మికులు, ప్రజాసంఘాల బంద్‌ ప్రశాంతం

కార్మికులు, ప్రజాసంఘాల బంద్‌ ప్రశాంతం2
2/3

కార్మికులు, ప్రజాసంఘాల బంద్‌ ప్రశాంతం

కార్మికులు, ప్రజాసంఘాల బంద్‌ ప్రశాంతం3
3/3

కార్మికులు, ప్రజాసంఘాల బంద్‌ ప్రశాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement