
ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం
● సందర్శించిన మేఘాలయ బృందం
సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయంపై మేఘాలయ వ్యవసాయ బృందం అధ్యయనం చేస్తోంది. మేఘాలయ రాష్ట్రానికి చెందిన 30 మంది రైతులు, మహిళా లీడ్ రైతులు, ఫీల్డ్ కోఆర్డినేటర్ల బృందం బుధవారం జిల్లా రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని సందర్శించింది. మేఘాలయ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకున్నారు. పలు గ్రామాల రైతులతో వారు మాట్లాడారు. ఆవు పేడ, మూత్రంతో సేంద్రియ ఎరువులు, క్రిమిసంహారక మందుల తయారీ, వాటి వినియోగంపై శిక్షణ పొందారు. ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానం పొందిన మేఘాలయ రైతులు మాట్లాడుతూ తమ రాష్ట్రంలో కూడా ప్రకృతి వ్యవసాయంలో నాణ్యమైన పంటలు పండించి అధిక దిగుబడులు సాధిస్తామని తెలిపారు. మేఘాలయ రాష్ట్ర రూరల్ లైవ్‌లీహుడ్స్ సొసైటీ, ఏపీ రైతుసాధికార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.