
● విరబూసిన దాలియా
మన్యంలో దాలియా పూల సీజన్ ప్రారంభమైంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలు సాగుకు అనుకూలించాయి. ఆగస్టులో రావాల్సిన దిగుబడి నెలరోజుల ముందుగానే ప్రారంభమైందని గిరిజన రైతులు తెలిపారు. పాడేరు డివిజన్‌లో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, డుంబ్రిగుడ మండలాల్లో గిరిజన రైతులు బంతితోపాటు దాలియాను సాగు చేస్తున్నారు. వివిధ రంగుల్లో పండించే ఈ రకం పూలకు మైదాన ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది. బుట్ట పూలకు రూ.100 వరకు ధర పలుకుతోంది. తక్కువ విస్తీర్ణంలో వేయడం వల్ల సీజన్‌లో రైతులు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. మండలంలోని బరిసింగి గిరిజన రైతులు శుక్రవారం దాలియా పూలను జిల్లా కేంద్రం పాడేరు మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించి మంచి ఆదాయం పొందారు. – సాక్షి, పాడేరు