రెండు బైక్‌లు ఢీకొని ఆరుగురు యువకులకు తీవ్రగాయాలు
వై.రామవరం : మండలంలోని పనసలపాలెం, చవిటిదిబ్బలు గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో ఆదివారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఆరుగురు యువకులు తీవ్రగాయాల పాలయ్యారు. ఎస్‌ఐ బి.రామకృష్ణ తెలిపిన వివరాలివి. మండలంలోని పి.యర్రగొండ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై పి.యర్రగొండ వైపు వెళుతుండగా అడ్డతీగలకు చెందిన మరో ముగ్గురు యువకులు వై.రామవరం నుంచి అడ్డతీగల వైపు వెళుతూ పనసలపాలెం గ్రామ శివారు ఒక టర్నింగులో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని స్థానిక సీహెచ్‌సీకి తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, మెరుగైన వైద్యసేవల కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. ఘటనపై ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎంఎల్‌సీ చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


