ఏడాది పాలనలో అంతా మోసమే
పాడేరు : ఏడాది కాలంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వైఎస్సార్‌సీపీ ముద్రించిన వెన్నుపోటు పుస్తకాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు అన్నీఇన్నీ కావన్నారు. ప్రజలు నిలువునా మోసపోయారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది పాటు గడువు ఇచ్చినా పథకాలు అమలు చేయలేకపోయిందన్నారు. ఇదేమిటని పశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ మోసాలు, అన్యాయాలు, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలపై ఈనెల 16న నియోజకవర్గ స్థాయిలో, 17న మండల స్థాయిలో వెన్నుపోటు పుస్తకాలను ఆవిష్కరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, అరకు నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు సమిడ వెంకటపూర్ణిమ, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, యువజన విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడు అశోక్, గ్రీవెన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సందడి కొండబాబు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు కూడా సుబ్రమణ్యం, కిల్లు కోటిబాబు, దన్నేటి పలాసి రాంబాబు, బోనంగి రమణ, పాంగి నర్సింగరావు పాల్గొన్నారు.
అక్రమాలు, అఘాయిత్యాలు
అన్నీ ఇన్నీకావు
హామీలను తుంగలో తొక్కిన
కూటమి ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,
పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస
విశ్వేశ్వరరాజు ధ్వజం
‘వెన్నుపోటు’ పుస్తకం ఆవిష్కరణ


