అక్షరజ్ఞానం కల్పించాలని గిరిజనుల వినతి
గూడెంకొత్తవీఽధి: పిల్లలు చదువుకునేందుకు పాఠశాల లేక అక్షరానికి దూరమవుతున్నారని జెర్రెల పంచాయతీ కన్నీరుశిల్ప,గడిమామిడి,గునుకురాయి గిరిజనులు కోరుతున్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ పిల్లల భవిషత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే పాఠశాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు కలెక్టర్ దినేష్‌కుమార్, ఇన్‌చార్జి పీవోపీవో అభిషేక్ గౌడ్ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేకుంటేచదువుకు దూరమైపోతారని వాపోయారు.గతంలో అనేక సార్లు పాఠశాల ఏర్పాటుచేయాలని వినతులు ఇచ్చినా సందించలేదని ఆయా గ్రామాలకు చెందిన కొర్రా బాలన్న, వంతల బాలకృష్ణ, సన్యాసిరావు, లక్ష్మయ్య,చిన్నయ్య, చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు.


