
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి
చింతపల్లి: జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని స్థానిక ఏఎస్పీ నవ జ్యోతిమిశ్రా అన్నారు. ఆయన సోమవారం జాతీ య రహదారి నిర్మాణ ఇంజినీరింగ్ అధికారులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారిలో తప్పని సరిగా ప్రమాద ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు, సోలార్ బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు,జాతీయ రహదారి ఏఈఈ తిలక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో ఎక్కువ మంది మరణిస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రధానంగా ఆటోలు, జీపులతో పాటు సర్వీసు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించడంతో పాటు అన్ని రికార్డులను కలిగి ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా