
అంతర్రాష్ట్ర రోడ్డుకు పోలీస్‌శాఖ మరమ్మతులు
గూడెంకొత్తవీధి: ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోకపోయినా ప్రయాణికుల అవస్థలు గమనించిన పోలీసు శాఖ పాడైన రహదారికి మరమ్మతులు చేసేందుకు ముందుకు వచ్చింది. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో పోలీసులు అంతర్రాష్ట్ర రహదారిలో ఆర్‌వీ నగర్ నుంచి లంకపాకల వరకు పలు చోట్ల పెద్ద పెద్ద గోతులను పూడుస్తున్నారు. రోడ్డు మరమ్మతు పనులను ఏఎస్పీ సోమవారం పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట గూడెం సీఐ వరప్రసాద్, ఎస్‌ఐ అప్పలసూరి ఉన్నారు.
పనులను పరిశీలించిన చింతపల్లి ఏఎస్పీ