
కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి
పెదబయలు: ప్రతి ఒక్కరికీ చూపు ఎంతో ముఖ్యమని, అందువల్ల కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–1లో డాక్టర్ దుడ్డు సత్యనారాయణ,పాఠశాల హెచ్‌ఎం నాగేశ్వరరావు,విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గతంలో 90 ఏళ్ల వయసు వచ్చే వరకూ కళ్లద్దాలు అవసరం లేకుండా చూసేవారని చెప్పారు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కళ్లద్దాల అవసరం ఏర్పడుతోందన్నారు. ఈ శిబిరానికి 250 మంది హాజరు కాగా, 25 మందికి కంటి ఆపరేషన్ల చేయాలని, 30 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించినట్టు శంకర్ ఫౌండేషన్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొర్రా రాజుబాబు, ఎంపీటీసీ బొంజుబాబు, మఠం సత్యనారాయణ పడాల్, పీహెచ్ బాలకృష్ణ పాల్గొన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
జల్లిపల్లి సుభద్ర