
పరిశ్రమల కోసం భూములు కోల్పోయాం..
మాది దుప్పితూరు గ్రామం. నేను అచ్యుతాపురం నుంచి విశాఖలో గల ఒక ప్రైవేట్ పరిశ్రమలో పని చేసుకునేందుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం రాకపోకలు చేస్తున్నాను. బ్రాండిక్స్ పరిశ్రమలో మా భూములు కోల్పోయాం. కంపెనీ వారు వెయ్యి ఎకరాల స్థలం ఏడాదికి కేవలం వెయ్యి రూపాయలు లీజుకి ప్రభుత్వం నుంచి తీసుకుని, 60 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నేటికీ కల్పించలేదు. నా లాంటి అర్హత కలిగిన ఎందరో యువకులు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం చొరవతో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాను. –మాడెం అజయ్, స్థానిక యువకుడు