
12 బాలల సంరక్షణ కేంద్రాలకు గుర్తింపు
పాడేరు : జిల్లాలో 12 బాలల సంరక్షణ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. బాలల సంక్షేమం, సంస్కరణలు, వీధి బాలల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ కేంద్రాల నిర్వహణకు రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం కోసం సుమారు 16 సంరక్షణ కేంద్రాల ప్రతినిధులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ పీడీ సూర్యలక్ష్మి, జువైనల్ ప్రొబేషన్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిర్వహణకు అనువుగా ఉన్న 12 బాలల సంరక్షణ కేంద్రాలను గుర్తించారు. ఈ మేరకు వారికి ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ దినేష్‌కుమార్ అందజేశారు.