
మెరుగైన వైద్యం అందించాలి
చింతూరు: ఎంతో నమ్మకంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లక్ష్మి ఆదేశించారు. గురువారం ఆమె స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆమె తెలుసుకున్నారు. రోగుల వార్డులు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ, డయాలసిస్ సెంటర్, చిన్నపిల్లల వైద్య విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, రోగులకు నాణ్యతతో కూడిన వైద్యసేవలు అందించాలని సూచించారు. అన్నిరకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యసిబ్బంది సమయపాలన పాటిస్తూ వైద్యసేవలు మెరుగు పరచాలని ఆమె ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో పరీక్షలు నిర్వహించి వ్యాధి మూలాలను కనుగొని దానికి తదనుగుణంగా త్వరితగతిన వైద్యసేవలు అందించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంవీ.కోటిరెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.
డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లక్ష్మి