
నిష్ఫలం
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఆశించిన స్థాయిలో ఉత్పాదన జరగడం లేదు. గతేడాది కన్నా నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నా జనరేటర్లు తరచూ మరమ్మతులకు గురవడంతో లక్ష్యం మేరకు ఉత్పత్తి చేయలేకపోతోంది. ఆరింటిలో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. పాత యంత్రాలు కావడంతో ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
నీళ్లున్నా
జనరేటర్లు : 6 ఉత్పాదన: 120 మెగావాట్లు పనిస్తున్నవి: 4 ఉత్పత్తి: 80 మెగావాట్లు
ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరు అందించే ప్రధాన డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నా వినియోగించుకోవడంలో ఆంధ్రా–ఒడిశా అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు నిలకడగా ఉన్నాయి. గత కొద్ది నెలలుగా ఏజెన్సీలో చెదురుమదురుగా కురిసిన వర్షాలకు వరద నీరు అధికంగా వచ్చి చేరింది. దీంతో నీటి మట్టం క్రమేపీ పెరిగింది. జోలాపుట్టు జలాశయ నీటి మట్టం 2750 అడుగులు కాగా గురువారం నాటికి 2730.55 అడుగులుగా నమోదయింది. గత ఏడాది ఇదే రోజుకు 2697.95 అడుగులు నీటి నిల్వ ఉంది. డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా ప్రస్తుతం 2575 అడుగులుగా ఉంది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం దిగువున ఉన్న డుడుమ జలాశయానికి రెండు గేట్లు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని రెండు రోజులుగా విడుదల చేస్తున్నారు. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు అందుబాటులో ఉందని జలాశయ అధికారులు చెబుతున్నారు.
120కు 80 మెగావాట్లు మాత్రమే ఉత్పాదన
మాచ్‌ఖండ్‌లో ఆరు యూనిట్లతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. నాలుగు యూనిట్లలో 80 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. రెండు యూనిట్లు మరమ్మతుల్లోనే ఉన్నాయి. ఈ జలవిద్యుత్ కేంద్రంలో గత కొన్నేళ్లుగా జనరేటర్ల మరమ్మతులకు గురవుతుండటం వల్ల పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. ఆరు జనరేటర్ల సాయంతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి. వీటిలో 2,3,5,6 జనరేటర్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 1,4 నంబరు జనరేటర్లు మరమ్మతుల దశలో ఉన్నాయి.
● జలవిద్యుత్ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూలింగ్ వాటర్ పంపుల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఐదు జనరేటర్లలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవడంతో ప్రస్తుతం 80 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతోంది.
మరమ్మతుల వైపే మొగ్గు?
ప్రాజెక్టు అధికారులు పాతబడిపోయిన జనరేటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. వీరు మరమ్మతులవైపే మొగ్గుచూపుతున్నారన్న విమర్శలున్నాయి. మరమ్మతుల వల్ల నిధులు వృధా తప్ప జలవిద్యుత్ కేంద్రానికి ఎటువంటి ఉపయోగం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు జనరేటర్లు మరమ్మతులకు పరిమితం అవడం వల్ల పూర్తిస్థాయిలో ఉత్పాదన సాధ్యం కావడం లేదు. ఇప్పటికై నా జలవిద్యుత్ కేంద్రం ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పాదనపై దృష్టి సారించాలని సరిహద్దు ప్రాంతీయులు కోరుతున్నారు.
మాచ్‌ఖండ్ సామర్థ్యం
నిండుగా డుడుమ, జోలాపుట్టు
జలాశయాలు
తరచూ మరమ్మతుల్లో జనరేటర్లు
ఆరింటిలో నాలుగు మాత్రమే
వినియోగం
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో
మెరుగుపడని ఉత్పాదన
ప్రాజెక్ట్ సాధారణ నీటిమట్టం (అడుగుల్లో) ప్రస్తుతం
జోలాపుట్టు 2,750 2730
డుడుమ 2590 2575
పూర్తిస్థాయి ఉత్పాదనకు చర్యలు
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదనకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం మరమ్మతులకు గురైన 1,4 నంబరర్ల జనరేటర్లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారు. డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నిల్వలు ఉన్నందున నీటి సమస్య లేదు.
– ఏవీ సుబ్రమణ్యేశ్యరరావు, ఎస్‌ఈ, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం

నిష్ఫలం

నిష్ఫలం

నిష్ఫలం