
త్వరితగతిన సమస్యలపరిష్కారానికి చర్యలు
● ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు
చింతూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు సూచించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలకు సంబంధించి 73 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిలో పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి 48, భూ సమస్యలకు సంబంధించి 7 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఏపీవో సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.