
చందనం విక్రయాల ప్రారంభం
సింహాచలం: చందనోత్సవం నాడు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిపై ఽనుంచి ఒలిచిన నిర్మాల్య చందనాన్ని మంగళవారం నుంచి విక్రయాలు ప్రారంభించారు. ఉచిత దర్శనం క్యూలో 400 మందికి, రూ.100 క్యూలో 300 మందికి, రూ. 300 క్యూలో 300 మందికి ఒక్కో ప్యాకెట్ పది రూపాయలు చొప్పున విక్రయించారు. దేవస్థానం ఏఈవో ఎన్.ఆనంద్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇంటర్‌లో ప్రవేశానికిదరఖాస్తుల ఆహ్వానం
పెదబయలు: ముంచంగిపుట్టు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలలో 2025–2026 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ పి.కేశవరావు తెలిపారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, టెన్త్ మార్కుల మెమో, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జెరాక్స్ కాపీలతో ముంచంగిపుట్టు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాల(పెదబయలు)లో లేదా పాడేరు గురుకులం సెల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. షెడ్యూల్ తెగల విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆయన వివరించారు.