
ఉచిత పథకాల పేరిట ‘కూటమి’ మోసం
వీఆర్‌పురం: ఉచిత పథకాల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్.రమణి ఆరోపించారు. ఐద్వా శిక్షణ తరగతులలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తామని ప్రజలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేసిందన్నారు. నిధుల కొరత పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. తల్లికి వందనం, ఫ్రీగ్యాస్, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి రూ.3వేలు, గృహణిలకు నెలకు రూ.1500 ఇస్తానని మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. ప్రభుత్వ విధానాలపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ఆదివాసీ హక్కులు, చట్టాల అమలును పాలక ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. ఐద్వా జిల్లా ప్రతినిధులు పద్మ, నున్నం పార్వతి, ముర్రం రంగమ్మ, వీరమ్మ, సుబ్బమ్మ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వీఆర్ పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల మహిళా సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు.
నూరు శాతం ఫలితాల సాధన
పెదబయలు: ముంంచంగిపుట్టు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ పి.కేశవరావు తెలిపారు. 2024–2025 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్లస్–2లో 76 మంది పరీక్షలు రాస్తే 76 మంది ఉత్తీర్ణత సాధించారని, టెన్త్‌లో 57 మందికి 57 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. టెన్త్‌లో వరుసగా నాలుగేళ్ల పాటు శాతశాతం ఉత్తీర్ణత, ఇంటర్ ప్లస్–2లో రెండేళ్ల పాటు శతశాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందన్నారు.