
బ్యాలెట్ విధానంపైనా అనాసక్తి
అడ్డతీగల: అడ్డతీగల గ్రామ పీసా కమిటీ ఎన్నిక బ్యాలెట్ విధానంలో సోమవారం నిర్వహించినా ఓట్లు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపలేదు. తరచూ కోరం లేక వాయిదా పడుతున్న నేపథ్యంలో చేతులు ఎత్తే విధానంలో కాకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టారు. దీంతో సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో బ్యాలెట్ విధానంలో ఎన్నిక నిర్వహించారు. అడ్డతీగల పంచాయతీలోని డొక్కపాలెం, అనిగేరు, అడ్డతీగల గ్రామాల్లో కలిపి 3 వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే సోమవారం నాటి బ్యాలెట్ విధానంలో నిర్వహించిన ఎన్నికకు 257 ఓట్లు పోలయ్యాయి. దీంతో పీసా ఎన్నికపై సందిగ్ధత తొలగలేదు. మంగళవారం ఓట్ల లెక్కింపు ఉన్నతాధికార్ల సమక్షంలో జరిపి ఉపాధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికను తెలియజేస్తామని అధికారులు చెబుతున్నారు. బ్యాలెట్ బాక్స్‌ని ప్రత్యేక గదిలో ఉంచి తాళాలు వేసి పోలీసులకు అప్పగించారు.
అడ్డతీగల గ్రామ పీసా ఎన్నికపై తొలగని సందిగ్ధత